- Advertisement -
టోక్యో: జపాన్ ప్రధానిగా ఫుమియో కిషిద బుధవారం మరోసారి ఎన్నికయ్యారు. అక్టోబర్ 31 జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడంతో ప్రధానిగా మరో పర్యాయం కిషిద ఎన్నికయ్యారు. 465 మంది సభ్యులతో కూడిన దిగువ సభలో కిషిద సారథ్యంలోని పార్టీకి 261 స్థానాలు లభించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరోసారి అవకాశం లభించింది. కరోనా కాలంలో దేశ ఆర్థిక పరిస్థితితోపాటు వైద్యారోగ్య రంగంలో ఎదురైన సవాళ్లను సమర్థంగా అధిగమించినందుకు ప్రజలు ఆయనకు మరోసారి అధికారాన్ని అప్పగించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నేడో రేపో రెండవసారి ఆయన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు.
- Advertisement -