Wednesday, January 22, 2025

విద్యార్థినీ విద్యార్థులకు చదువే మూల ధనం

- Advertisement -
- Advertisement -

అమ్రాబాద్ : విద్యార్థినీ, విద్యార్థులకు చదువే మూలధనమని ప్రభుత్వ విప్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాం తాల్లో ప్రభుత్వ బడులను ఏర్పాటు చేసి పేద ప్రజల పిల్లలకు విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు మంచి అవకాశాలు, సదుపాయాలు కల్పిస్తూ వారికి నాణ్యమైన విద్యను తెలంగాణ ప్రభుత్వం అ ందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News