- Advertisement -
న్యూఢిల్లీ : జూలైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిధులు తగ్గాయి. గత నెలలో దాదాపు రూ.8,898 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయి. అయితే అంతకముందు నెలతో పోలిస్తే ఫండ్స్‌లోకి నిధులు 43 శాతం క్షీణించాయి. స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతుండడం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, వడ్డీ రేటు పెంపు వంటి అంశాల కారణంగా మ్యూ చువల్ ఫండ్స్‌లోకి నిధుల ప్రవాహం తగ్గింది. మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఎఎంఎఫ్‌ఐ) విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్‌లో రూ.15,495 కోట్ల నిధులు, మే నెలలో రూ.18,529 కోట్ల నిధులు, ఏప్రిల్‌లో రూ.15,890 కోట్ల నిధులు ఫండ్స్‌లోకి వచ్చాయి.
- Advertisement -