Monday, November 18, 2024

పురపాలికలు, పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హామీల అమలు మేరకు నిధులు మంజూరయ్యాయి. సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సిఎం కెసిఆర్ ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు పురపాలికలు, పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు గురువారం ఆర్థికశాఖ నిధులు మంజూరు చేసింది. దీనికి అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి నిధులు మంజూరు చేశారు. కామారెడ్డి పురపాలికకు రూ.50 కోట్లు, బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి పురపాలికలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి.

కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామపంచాయతీలకు పది లక్షల చొప్పున నిధులు, మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలో అభివృద్ధి పనుల కోసం రూ.20 కోట్ల నిధులను ఇవ్వనున్నారు. భువనగిరి పురపాలికకు కోటి రూపాయలు, మోత్కూరు, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ పురపాలికలకు రూ.50 లక్షల చొప్పున నిధులు రానున్నాయి. యాదాద్రి జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు 25 లక్షల చొప్పున నిధులను మంజూరు చేశారు. 281.35 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Funds Release for municipalities and Panchayats in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News