Monday, December 23, 2024

ఓయు హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదల : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా రూ. 7.5 కోట్లు విడుదల చేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇటీవల ఓయు సందర్శించిన కేంద్రమంత్రి అక్కడి సమస్యలను చూసి చలించారు. వైస్ ఛాన్స్‌లర్,ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌తో మాట్లాడి పరిస్థితిని వివరించారు. హాస్టల్ భవనాల నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. దీంతో కేంద్రమంత్రి స్పందించారు. విద్యార్థుల కోసం మొత్తం రూ.30 కోట్ల అంచనాలతో సాగుతున్న రెండు వేర్వేరు హాస్టళ్ల నిర్మాణానికి (యువతులు, యువకుల కోసం) తొలివిడతగా ఈ నిధులను విడుదల చేశారు. హాస్టళ్లు నిర్మించేందుకు 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ..
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న సేవపక్షం కార్యక్రమంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బస్తీల్లో ఆయన పర్యటించి పేదలకు నిత్యావసర వస్తువులను అందజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News