Friday, December 20, 2024

నిధులొచ్చినా నిర్లక్ష్యమే..

- Advertisement -
- Advertisement -

కుంటాల : మండలం లోని ఓలా నుండి అంబుగాం వరకు దాదాపు 7 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా రహదారికి మోక్షం లభించడం లేదు. దీంతో గత సంవత్సర క్రితం సంబంధిత అధికారులు టెండర్లు నిర్వహించగా రహదారి పనులను గుత్తేదారులు పనులను ప్రారంభించారు. మధ్యలోనే అసంపూర్తిగా రోడ్డు పనులను ఆపివేసి అసంపూర్తిగానే ఉంచారు.

అంబుగాం గ్రామానికి రహదారి సక్రమంగా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు స్థానిక సమావేవాల్లో సైతం ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులతో పాటు అధికారుల దృష్టి తీసుకెళ్లిన రోడ్డు సమస్య పరిష్కారం కావడం లేదు దీంతో ఏళ్లు గడస్తున్నా అంబుగాం రోడ్డు నిర్మాణానికి మోక్షం లబించడం లేదు. దీంతో గ్రామస్తులు నానా ఇబ్బందులు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News