Monday, December 23, 2024

డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : కాప్రా సర్కిల్ మీర్‌పేట్ హెచ్‌బికాలనీలో అభివృద్ధ్ది పనుల కోసం నిధులు మంజురు చేయాలని డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ కోరారు. బుధవారం జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్‌ను జిహెచ్‌ఎంసి కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ స ందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఓల్డు మీర్‌పేట్ హన్‌మాన్ టెంపుల్ నుంచి అన్నపూర్ణకాలనీ వరకు ఆర్‌సిసి బాక్స్‌డ్రైన్‌ను, అలాగే డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సిసిరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. సానుకులంగా స్పందించిన కమిషనర్ త్వరలోనే నిధులు మంజురు చేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News