Monday, December 23, 2024

ముంబైలో సైరస్ మిస్త్రీకి అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

Funeral of Cyrus Mistry in Mumbai

ముంబై : టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ భౌతిక కాయానికి మంగళవారం ఆర్థిక రాజధాని ముంబైలో అంత్యక్రియలు జరిగాయి. సెంట్రల్ ముంబై వొర్లి దహనవాటికలో జరిగిన ఈ అంత్యక్రియలకు పార్టీ సామాజిక వర్గంలోని అత్యంత సన్నిహితులు, వాణిజ్యవేత్తలు , రాజకీయ నేతలు పాల్గొన్నారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కూడా హాజరయ్యారు. 92 ఏళ్ల సిమోన్ టాటా వీల్‌ఛైర్‌లో స్పెషల్ వ్యానులో అక్కడికి వచ్చారు. మాజీ టిసిఎస్ అధినేత ఎస్. రామదొరై తప్ప టాటా గ్రూపుకు చెందిన సీనియర్ అధికారులెవరూ హాజరు కాలేదు. మిస్త్రీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఎంపిక చేసిన ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ మధుకన్నన్ దహనవాటిక వద్ద కన్పించారు. మిస్ట్రీ పెద్ద సోదరుడు షపూర్ మిస్త్రీ, మామయ్య , సీనియర్ లాయర్ ఇక్బాల్ చాగ్లా, పారిశ్రామిక వేత్తలు అనిల్ అంబానీ, అజిత్ గులాబ్‌చంద్, దీపక్ పరేఖ్, విశాల్ కంపానీ, వాణిజ్యవేత్త రోనీ స్క్రూవాలా, ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్, ఎన్‌సిపి నేతలు సుప్రియా సులే, గణేష్ నాయక్, మాజా కాంగ్రెస్ ఎంపి మిలింద్ డియోరా, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News