Friday, November 22, 2024

సేనానికి అంతిమ సెల్యూట్

- Advertisement -
- Advertisement -

Funeral over for Bipin Rawat couple

తొలి సిడిఎస్ బిపిన్ రావత్ దంపతులకు ఢిల్లీ బ్రార్ స్క్వేర్ శ్మశానంలో సైనిక
లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు, 17 శతఘ్నలతో గౌరవ వందనం
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, త్రివిధ దళాధిపతులు సహా పలువురు ప్రముఖుల శ్రద్ధాంజలి, జాతి కన్నీటీ వీడ్కోలు

బిపిన్ రావత్ దంపతులకు జాతి కన్నీటి తుది వీడ్కోలు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతుల నివాళి
రాజకీయ నేతలు, అధికారుల అంతిమ శ్రద్ధాంజలి
సైనిక లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
17 శతఘ్నుల గౌరవ వందనం

న్యూఢిల్లీ: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూసిన తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులకు యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాం తంలోని బ్రార్ స్కేర్ శ్మశాన వాటికలో రావత్, ఆయన సతీమణి మధులిక పార్థివ దేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారులు, ప్రముఖుల నివాళుల అనంతరం కుమార్తెలు అంత్యక్రియలు జరిపారు. రావత్ దం పతుల భౌతిక కాయంపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని వారి కుమార్తెలకు అందజేశారు. పూర్తి సైనిక లాంఛనాల నడు మ అంత్యక్రియలు నిర్వహించారు. రావత్‌కు గౌరవ సూ చకంగా 17 శతఘ్నులను గాలిలోకి పేల్చి వందనం సమర్పించారు. సిడిఎస్ అంత్యక్రియల్లో 800 మంది సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ దామి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, డిఆర్‌డిఓ చీఫ్ జి సతీశ్ రెడ్డి, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు తదితరులు హాజరై తుది వీడ్కోలు పలికారు.అంతకు ముందు ప్రముఖులు, సైనిక సిబ్బంది సందర్శనార్థం రావత్ దంపతుల భౌతిక కాయాలను ఉదయం కామరాజ్ మార్గ్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు వారికి నివాళులరించారు.అనంతరం కామరాజ్ మార్గ్‌నుంచి బ్రార్ స్కేర్ శ్మశాన వాటికదాకా అంతిమయాత్ర సాగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ అంతిమయాత్రలో దారి పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు రావత్ దం పతులకు వీడ్కోలు పలికారు. ‘సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు నిలిచిపోతుంది’, ‘రావత్ అమర్ రహే’ అంటూ శోకతప్త హృదయాలతో నినదించారు. బపిన్ రావత్ దంపతులకు సిజెఐ కూడా నివాళి అర్పించారు.

పలు దేశాల సైనికాధికారులు హాజరు

రావత్ అంత్యక్రియల్లో పలు దేశాల సైనికాధికారులు పాల్గొన్నారు. శ్రీలంక సిడిఎస్, కమాండర్ జనరల్ షవేంద్ర సిల్వా, నేషనల్ డిఫెన్స్ కాలేజిలో రావత్‌కు మంచి మిత్రుడైన శ్రీలంక మాజీ అడ్మిరల్ రవీంద్ర చంద్రసిరి, రాయల్ భూటాన్ ఆర్మీ డిప్యూటీ ఆపరేషన్స్ చీఫ్ బ్రిగేడియర్ డోర్జీ రించన్, నేపాల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లెఫ్టెనెంట్ జనరల్ బాలకృష్ణ కార్కీ, బంగ్లాదేశ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డివిజన్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టెనెంట్ జనరల్ వకార్ ఉజ్ జమాన్, పలు దేశాల రాయబారులు హాజరై రావత్ పార్థివ దేహంవద్ద నివాళులర్పించారు.

లిద్దర్ సతీమణి గీతిక బాధాతప్త వ్యాఖ్యలు

బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్ కుటుంబం కూడా ఆ ఆవేదనలతోనే కుమిలిపోతోంది. శుక్రవారం అంతిమ సంస్కార సమయంలో లిద్దర్ సతీమణి, కుమార్తె కన్నీటిని చూస్తే చెమర్చని హృదయం ఉండదేమో! ఈ కఠిన సమయంలో కూడా వారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. వారి ధైర్యానికి సలాం కొడుతున్నాయి. విధులు నిర్వర్తిస్తూ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయిన లిద్దర్ శవపేటికను చుంబించి ఆయన సతీమణి గీతిక వీడ్కోలు పలికారు. తల్లి పక్కనే ఉన్న కుమార్తె ఆష్నా కూడా తన తండ్రి ఇక రారనే ఆవేదనతో కన్నీటిపర్యంతం అయ్యారు. ‘ మేం ఆయనకు గొప్పగా వీడ్కోలు పలకాలి. కన్నీటితో కాకుండా నవ్వుతూ , ప్రశాంతంగా సాగనంపాలి. నేనొక సైనికుడి భార్యను. ఇది పూడ్చలేని నష్టం’ అంటూ లిద్దర్ సతీమణి గీతిక స్పందించారు. ‘ఆత్మగౌరవంకన్నా ఎక్కువ బాధ ఉంది. ఇప్పుడు జీవితం ఇంకా ఎంతో ఉంది. అయితే దేవుడి ఇచ్ఛ ఇదే అయితే ఈ లోగుతోనే మేము జీవిస్తాం.

అయితే ఆయన ఇలా తిరిగి రావాలని మేము కలలో కూడా కోరుకోలేదు’ అని ఆమె అన్నారు. కుమార్తె ఆష్నా అయితే వయసుకు మించి దృఢచిత్తాన్ని ప్రదర్శించింది. ‘ఇప్పుడు నాకు 17 సంవత్సరాలు. అంటే నాకు, మా నాన్నకు మధ్య 17 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన దూరమవడం.. దేశానికి పూడ్చలేని నష్టం. బహుశా ఇదే విధి అనుకుంటా. నా తండ్రే నాకు హీరో, నా బెస్ట్ ఫ్రెండ్, నా మోటివేటర్’ అంటూ ఎంతో ధైర్యంగా మాట్లాడింది. అంతకు ముం దు బ్రార్‌స్కేర్ వద్ద లిద్దర్ భౌతిక కాయానికి మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, త్రివిధ దళాధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ రవికుమార్, ఎయిర్ చీఫ్‌మార్షల్ ఎఆర్ చౌధరి, ఇతర రక్షణ శాఖ ఉన్నతాధికారులుఅంజలి ఘటించారు. అనంతరం సైనిక లాంఛనాల నడుమ లిద్దర్‌కు తుది వీడ్కోలు పలికారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News