Wednesday, January 22, 2025

ఉచిత విద్యుత్‌ను అవహేళన చేసిన రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: పెద్దవూర మండల కేంద్రంలోని గురువారం నాగార్జునసాగర్ హైదరాబాద్ హైవే పై ఉచిత విద్యుత్‌ను అవహేళన చేస్తూ అమెరికా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టబొమ్మకు శవయాత్ర నిర్వహించి అనంతరం రోడ్డుపై ధర్నా చేసి, దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనకు మాకు వద్దంటూ ప్రజలు తిరస్కరించినప్పటికి మరోక సారి మాకు అధికారం కట్టబెడితే రాబందుల మాదిరిగా రక్తం పీల్చడానికి రెడిగా ఉన్నామంటూ మూడు గంటలు వి ద్యుత్ మాత్రమే సరిపోతుందని ఎద్దేవా చేశారు.

ఉచిత విద్యుత్‌పై విషం కక్కిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఒక్క సీటు కూ డా వేయకుండా బుద్ది చెప్పాలని ఎమ్మెల్యే నోముల భగత్ పిలుపునిచ్చారు. అన్నంపెట్టే రైతు దేశానికి వెన్నెముక సీఎం కేసీఆర్ స్వయంగా రై తు కాబట్టే రైతుల గురించి ఆలోచించారు అని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని రైతుబంధు, రైతుభీమా పథకాలు ప్రవేశపెట్టారు అ ని ఆయన తెలిపా రు. తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందని తెలిపారు.

ఈకార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఏసీయస్ చైర్మన్ గు ంటుక వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు కర్ణబ్రహ్మారెడ్డి, మండల పార్టీ అ ధ్యక్షుడు జటావత్ రవినాయక్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గజ్జుల లింగారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆడెపు రామలింగయ్య, మ ండల ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ అబ్బాస్, మార్కెట్ డైరెక్టర్లు పొదిల శ్రీను, రాజేష్ నాయక్, పోచం శ్రీనివాస్‌గౌడ్, మస్తాన్ యూత్ అధ్యక్షుడు బాలాజీనాయక్, మల్లికార్జున్, శివాజీనాయక్,  కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News