Friday, December 20, 2024

గాయాలు మాన్పడానికి ఫంగస్ జీవ పదార్ధం

- Advertisement -
- Advertisement -

బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను నియంత్రించడానికి యాంటీబయోటిక్స్‌ను విరివిగా వినియోగించడం పరిపాటిగా వస్తోంది. ఫలితంగా బహుళ ఔషధ నిరోధక ( మల్టీడ్రగ్ రెసిస్టెంట్ ) వ్యాధి కారకాలు అమాంతంగా పుట్టుకొస్తున్నాయి. ఈ వ్యాధికారకాలను నివారించడానికి పరిశోధకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జీవ పదార్ధాన్ని కనుగొన్నారు. ఇది గాయాలలో క్రిములు చేరకుండా అడ్డుకుంటుంది. వేగంగా గాయాలను మాన్పగలుగుతుంది.

ఈ ప్రయోగాలను ఎలుకల్లో చేపట్టి పరిశీలించగా గాయాలు వేగంగామానడం కనిపించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మండి, ఐఐటి ఢిల్లీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఎన్‌ఐఎస్ ఇ ఆర్) భువనేశ్వర్‌కు చెందిన శాస్త్రవేత్తల సమష్టి కృషితో ఈ పరిశోధన సాగింది. ఫంగస్ ఏరియోబెసీడియమ్ ఫుల్లులాన్స్ అనే ఫంగస్ నుంచి పోలిమర్ ఫుల్లులాన్ అనే జీవ పదార్ధాన్ని శాస్త్రవేత్తలు సేకరించగలిగారు. సహజమైన పోలిమర్స్ తాలూకు వైవిధ్య లక్షణాలను జీవవైద్య ప్రయోజనాల కోసం వినియోగించడంలో తాము నేర్పు సాధించామని ఐఐటి మండికి చెందిన శాస్త్రవేత్తలు వివరించారు. జీవపదార్థమైన ఫుల్లులాన్ ఇప్పటికే వాణిజ్యపరంగా వినియోగమవుతోంది.

ఇది విషపూరితం కానిది. ఎలాంటి మార్పులు లేనిది. అందువల్ల ఆహారం, కాస్మోటిక్స్, ఫార్మాక్యూటికల్ పరిశ్రమల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ పదార్ధాన్ని బయోమెడిసిన్ రంగంలో సూక్ష్మ జీవులను నాశనం చేసే ఔషధంగా, జన్యుపంపిణీ, పదార్ధంగా వినియోగిస్తున్నారు. ఇది ప్రధానంగా గ్లూకోజ్ లోని పొలిమెరిక్ చైను లోనిది. దీని పౌడర్ నీటిలో కరుగుతుంది. ఈ ద్రావణాన్ని గాయంపై పూతలా రాస్తే గాయం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News