Friday, December 20, 2024

గాయాలు మాన్పడానికి ఫంగస్ జీవపదార్ధం

- Advertisement -
- Advertisement -

Fungus biomass to heal wounds

ఐఐటి శాస్త్రవేత్తల అపూర్వ పరిశోధన

న్యూఢిల్లీ : బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను నియంత్రించడానికి యాంటీబయోటిక్స్‌ను విరివిగా ఉపయోగించడం పరిపాటిగా జరుగుతోంది. ఫలితంగా బహుళ ఔషధ నిరోధక (మల్టీడ్రగ్ రెసిస్టెంట్ ) వ్యాధికారకాలు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. ఇటువంటి వ్యాధికారకాలను నివారించడానికి పరిశోధకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కొత్త జీవ పదార్ధాన్ని కనుగొన్నారు. ఇది గాయాలలో క్రిములు చేరకుండా ఉండేలా చేయడమే కాక, వేగంగా గాయాలను మాన్పగలుగుతుంది. శాస్త్రవేత్తలు ఎలుకల్లో ఈ ప్రయోగాలు చేపట్టి పరిశీలించగా ఈ జీవ పదార్ధం గాయాలను వేగంగా మాన్ప గలుగుతుందని కనుగొన్నారు. జర్నల్ బయోమెటీరియల్స్ సైన్స్‌లో ఈ పరిశోధన వివరాలు వెల్లడయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మండి, ఐఐటి ఢిల్లీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఎన్‌ఐఎస్‌ఇఆర్) భువనేశ్వర్‌కు చెందిన శాస్త్రవేత్తల సమష్టి కృషితో ఈ పరిశోధన సాగింది.

ఫంగస్ ఏరియో బెసీడియమ్ పుల్లులాన్స్ అనే ఫంగస్ నుంచి పోలిమర్ పుల్లులాన్ అనే జీవ పదార్ధాన్ని సేకరించ గలిగారు. సహజమైన పోలిమర్స్ తాలూకు వైవిధ్య లక్షణాలను జీవవైద్య ప్రయోజనాల కోసం వినియోగించడంలో తాము నేర్పు సాధించగలిగామని ఐఐటి మండికి చెందిన డాక్టర్ అమిత్ జైస్వాల్ వివరించారు. జీవపదార్ధమైన పుల్లులాన్ ఇప్పటికే వాణిజ్యపరంగా వినియోగమవుతోంది. ఇది విషపూరితం కానిది. మార్పులు లేనిది, రోగనిరోధక శక్తి లేనిదైనందున ఆహారం, కాస్మోటిక్స్, ఫార్మాక్యూటికల్ పరిశ్రమల్లో ఎక్కువగా దీన్ని వినియోగిస్తున్నారు. ఈ పదార్ధాన్ని బయోమెడిసిన్ రంగంలో సూక్ష్మజీవులను నాశనం చేసే ఔషధంగా, జన్యుపంపిణీ పదార్ధంగా వినియోగిస్తున్నట్టు జైస్వాల్ చెప్పారు. ఇది ప్రధానంగా గ్లూకోజ్ లోని పాలిమెరిక్ చైను లోనిది. దీని పౌడర్ నీటిలో కరుగుతుంది. ఈ ద్రావణాన్ని గాయంపై పూతలా రాస్తే గాయం తగ్గుతుందని నిర్ధారణ అయిందని జైస్వాల్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News