Monday, January 20, 2025

ఆహార కల్తీ కలకలం

- Advertisement -
- Advertisement -

పిస్తా హౌస్ బనానా కేక్‌లో ఫంగస్ ఎక్స్ వేదికగా
కస్టమర్ ఫిర్యాదు తక్షణమే రంగంలోకి ఫుడ్‌సేఫ్టీ
అధికారులు నమూనాల సేకరణ, పరీక్షల కోసం ల్యాబ్ కు
వినియోగదారులను భయపెడుతున్న వరుస ఘటనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల క్యాడ్బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బ తికున్న పురుగులు వచ్చిన ఘటన కలకలం రేపగా, తాజాగా పిస్తా హౌజ్ బనానా కేక్‌లో ఫంగస్ వచ్చిన ఘటన అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఉప్పల్‌లోని పిస్తా హౌస్‌లోబనానా కేక్ కొన్న ఓ వ్యక్తి, మ రుసటి రోజు ఉదయం చూస్తే అందులో ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. పై గా ఏప్రిల్ 10 వర కు దాని వ్యాలిడిటీ ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పిస్తాహౌస్ యాజమాన్యం, జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు ఫిర్యాదు చే శారు. డైరీ మిల్క్ చాక్లెట్, పిస్తా హౌజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన వాటిలోనే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటం అందరూ ఆందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వ శాఖల నుంచి అన్ని అనుమతులు ఉండి ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో పాటు వ్యాలిడిటీ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటంతో ఏం తినాలన్నా ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. సాధారణంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల వద్ద ఏదైనా తింటే ఫుడ్ పాయిజన్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఇలాంటి ఆహార పదార్ధాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఆకర్షణీయ ప్యాకింగ్ కవర్ల వెనక కంటికి కనిపించని ఫంగస్, పురుగులు ఉంటుండటంతో ఏం తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

పిస్తా హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ఉప్పల్లోని పిస్తా హౌజ్‌లో ఆర్డర్ చేసి తీసుకెళ్లిన బనానా కేక్ తీసుకెళ్లిన కర్వేదన్ అనే వ్యక్తి బనానా కేక్‌లో ఫంగస్ రావడంతో పిస్తాహౌస్ యాజమాన్యంతో పాటు జిహెచ్‌ఎంసికి ఎక్స్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన జిహెచ్‌ఎంసి ఫుడ్ కంట్రోలర్ అధికారులు ఆదివారం ఉప్పల్‌లోని పిస్తా హౌజ్‌లో తనిఖీలు నిర్వహించారు. పిస్తా హౌజ్‌లో కిచెన్‌ను, ప్యాకింగ్ చేసిన తినుబండాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

పిస్తా హౌజ్ ప్లమ్ కేక్,స్పాంజ్ కేక్, మిల్క్ బ్రెడ్, బనానా కేక్ నమూనాలను సేకరించి పరీక్షల కోసం లేబరేటరీలకు పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని జిహెచ్‌ఎంసి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కె.బాలాజీ రాజు తెలిపారు. పేర్కొన్నారు. తినుబండారాలను విక్రయించేవారు నిబంధనల మేరకు పరిశుభ్రత పాటిస్తూ వినియోగదారులకు సురక్షిత ఆహారం విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, తన ఫిర్యాదుపై వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించిన ఫుడ్‌సేఫ్టీ అధికారులకు కర్వేదన్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News