Thursday, April 17, 2025

యంగ్ ఇండియా పోలీసు స్కూల్ అత్యంత ముఖ్యమైనది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్నిసిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తదుపరి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. మంత్రి శ్రీధర్ బాబు, పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తరగతి గదులను సిఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..పోలీసులకు యంగ్ ఇండియా పోలీసు స్కూల్ అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. పోలీసుశాఖపై తమకు స్పష్టమైన ఆలోచన ఉందని అన్నారు.

కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారని చెప్పారు. యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని తెలియజేశారు.16 నెలలైన బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని కొందరు అడిగారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో కనీస వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు నిధులు సమకూర్చుకోవాలని వెల్లడించారు. రూ. 100 కోట్లతో కార్పస్ ఫండ్ ను సమకూర్చుకోవాలని కోరారు. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. యంగ్ ఇండియాలో భాగంగా చదువు, ఉపాధే తమ బ్రాండ్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News