Monday, December 23, 2024

మొక్కలను సంరక్షిస్తేనే భావితరాలకు ప్రయోజనం

- Advertisement -
- Advertisement -

మక్తల్ : హరితహారంలో భాగంగా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు ప్రయోజనం ఉంటుందని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జడ్పీ చైర్‌పర్సన్ కె.వనజ ఆంజనేయులు గౌడ్ అన్నారు. మక్తల్ మండలంలోని లింగంపల్లి, ఊట్కూరు మండలంలోని తిప్రాస్‌పల్లి, మల్లెపల్లి శివారులో ప్రధాన రహదారికి ఇరువైపు లా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీళ్లను పోశారు.

కళాశాల నిర్వహణకు భవన పరిశీలన..
మక్తల్ మండలంలోని సంగంబండ వద్ద నిర్వహిస్తున్న సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలను నిర్వహించనున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణ కు అవసరమైన భవనాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించా రు. ఇరిగేషన్ శాఖకు చెందిన క్వార్టర్స్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నందున వాటిలోనే కళాశాల నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మక్తల్ కస్తూర్భా పాఠశాల వద్ద రూ.15లక్షల వ్యయంతో చేపట్టిన ప్రహారీ నిర్మాణ పనులను ఆ యన పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డీఓ గోపాల్‌నాయక్, ఎంపిడీఓ శ్రీధర్, తాసిల్దార్ తిరుపతయ్య, మున్సిపల్ కమిషనర్ జి.మల్లికార్జున స్వామి, గురుకులాల అధికారిణి దేవసేన, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ నీలేష్, ఎంపిటిసిలు జి.బలరాంరెడ్డి, తిమ్మప్ప, ఏపిఓ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News