మనుషుల మనస్తత్వాల మధ్య తీవ్రమైన అంతరాలు పెరుగుతున్నవర్తమాన సమాజంలో వ్యక్తులతో ఎలా మసలుకోవాలో కనుగొనడం ఎవరికైనా కష్టమవుతోంది. వృత్తి ఏదైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రాజకీయమైనా జీవితం చంచలమైపోయింది. మన దో, మందిదో, మంచిదో, చెడ్డదో దారి ఏదైనా తమ అవసరాలు తీరాలనే ఆశ పెరిగిపోతోంది. ఇందుకోసం అబద్ధమాడుతున్నామా, నమ్మ క ద్రోహమే చేస్తున్నామా అనేది అనవసరం. ఒకరి మాటపై మరొకరి కి పూర్తిగా నమ్మకం పోయింది. చెప్పే మాట వెనుక ఏదో మతలబు ఉంటుందనే జాగ్రత్తలు పెరిగిపోయాయి. స మాజంలో నలుగురితో పాటు కలిసి ఉండడం అనే మాటేమో గాని కనీసం సొంత మనుషులతో, తోడబుట్టినవారితోనైనా నిజాయితీగా వ్యవహరించడం సాధ్యపడడం లేదు.
వివిధ పరిణామాల కారణంగా సమాజం నిరంతరం తప్పనిసరిగా మార్పుల కు లోనవుతుంది. మంచికైనా చెడుకైన మానవ జీవితాలపైనా గాఢమైన ముద్ర వేసే వ్యక్తుల వల్ల, సందర్భాల వల్ల ఒక్కోసారి ఈ మార్పుల్లో వేగం, మలుపులు అనూహ్యాంగా ఉంటా యి. మంచి విషయానికొస్తే- సమాజంలో అత్యధికంగా ఉన్న కష్టజీవులు అర్దాకలితో బతుకుతున్న స్థితికి చలించి ఒక మహానుభావుడు వారికి తిరుగుబాటు నేర్పుతాడు. స్పార్టకస్ కావచ్చు, బుద్ధుడు కావ చ్చు, మారక్స్ కావచ్చు. మరెవరైనా కావచ్చు. వారి బోధనలకు ప్రభావితులైనవారు ఉద్యమాలను నిర్మించి శ్రామికుల జీవితాల్లో మార్పు తె చ్చేందుకు కృషి చేస్తారు. త్యాగాలకు సిద్ధపడతారు. ప్రజాబలం తోడైతే పాలక వ్యవస్థలను కూల్చేసి శ్రామిక శ్రేయో రాజ్యాన్ని నిర్మిస్తారు.
చరిత్ర గమనంలో కాలమెంత కఠినమైనదంటే ఎంతో శ్రమకోర్చి, కష్టనష్టాలకోర్చి ఏర్పడ్డ ప్రజా రాజ్యాలు ఎంతో కాలం నిలువలేదు.
యుద్దాలు నడిపిన పార్టీ తర్వాతి తరం వారే పాలన చేపట్టినాక పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి రాజీపడిపోయారు. గొప్ప సిద్ధాంతాని కి ఆచరణ దారితప్పి పోరు ఫలితాలు కుక్క మూతి పిందెలయ్యాయి. సంస్కర్తలు సాధించిన ప్రయోజనాలను దీర్ఘకాలం కొనసాగించడం లో తరవాతి తరం నేతలు విఫలమయ్యారనే కన్నా శత్రువు కుట్రలో భాగమై ప్రజారాజ్యాలకు ద్రోహం చేశారనాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పేవారు నోళ్లు మూతపడేలా ప్రజాస్వామ్యవాదులపై కేసులు, అరెస్టులు, పౌరసమాజాలపై నిషేధాలు కొనసాగుతున్నాయి. విషాదమేమంటే తమకు కనువిప్పు కలిగేంచేవారిని ప్రజలు గుర్తించే సోయి కోల్పోతున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి లేకుంటే తమపై కూడా దేశద్రోహి అనే ముద్ర పడవచ్చని భద్రజీవులు జాగ్రత్తపడుతున్నారు. పౌర హక్కులు, రాజ్యాంగ హామీ అంటూ సామాన్యుడికి బాసటగా నిలిచే మేధోవర్గం కాలక్రమంగా తగ్గిపోతుంది. వారి గొంతు వినేవారి సంఖ్య కూడా పలుచబడుతోంది. భాష, సంస్కృతి అనేవి అస్తిత్వవాదానికి పట్టుకొమ్మలు. వాటిని నరికేస్తే మనుషులు సమూహాలుగా ఉండే అవకాశమే ఉండదు. భాషా, సంస్కృతులను లుప్తం చేసి మనుషుల్ని సమూహాల నుండి విడదీసి మళ్ళీ ఉద్యమాలకు తావు లేకుండా చేయడం నేడు సాగుతున్న కొత్తరకం కుట్ర. తెలుగు భాష బతికి బట్ట కడుతుందా అనేది కాలనిర్ణయమే.
ఇప్పటికే సగం వాడుక భాష ఆంగ్లమయమై పోయింది. మాటల్లో తెలుగు పదాల వాడకం నమోషు చేయడం తొలి ఘాతం. నగరాలు, పట్టణాల్లో చదువుకున్న కుటుంబాల నుండి తెలుగు మాయమైందన్నా తప్పు లేదు. భాషాభిమానం ధ్వంసం కావడమే పాలకులకు కావలసింది. ప్రశాంత మనోవికాస కేంద్రాలుగా విలసిల్లిన మన సంస్కృతి, కళలు పాశ్చాత్య ప్రభావంతో పచ్చి వినోద చిందులుగా మారిపోయాయి. నలభై ఏళ్ల తరంలో ఎదురవుతున్న సమస్యల్లోంచి ఎలా గట్టెక్కాలో తెలియని సతమత కనబడుతుంది. ముప్పైఏళ్ళ లోపువారికి అంటీ ముట్టక సొంత సౌఖ్యం కోసం ఇలా బతకడమే ఆనందంగా ఉందనిపిస్తుంది. ఇందులో ఎవరి కోణం వారిది. ఏ ఆలోచనను ప్రామాణికంగా తీసుకోలేం. అందుకే సమాజం భ్రష్టు పట్టిపోతోంది అనే వేదనకు సమాధానం కనబడదు. అది సామాజిక మేధావుల సమస్య, వారి గోలవారిది అన్నట్లుగా లోకం నిర్లిప్తంగా, అనాసక్తిగా సాగిపోతుంది. కాలప్రవాహంలో నిన్నటి నీటిని నేడు తాగుతామంటే దొరకవు. కొత్త నీరుకు అలవాటు పడాలి.
బి.నర్సన్ 9440128169