Monday, December 23, 2024

భవిష్యత్ బిఆర్‌ఎస్‌దే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావ డం లేదని, సర్కార్ తీరుపై ప్రజల్లో విసు గు ప్రారంభమైందని బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అన్నారు. కాంగ్రెస్ నే తలు వాళ్లలో వాళ్లే కొట్టు కుంటారని, కాం గ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, ఆరోపణలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అం శాల కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపిద్దామని పిలుపునిచ్చారు. రాబోయే కాలం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.లోక్‌సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా రెండు రోజులుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో కెసిఆర్ సమావేశమవుతు న్నారు. సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ ని యోజకవర్గాల నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు, ఎంపీలు కేశవరావు,వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వర రావు, మాలోతు కవిత, మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, సహా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని, ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కెటిఆర్ అన్నారు.
గతంలో భట్టి చెప్పిన మాటలు ఒట్టి మాటలు అని అర్థమయ్యింది
గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు, ఇదే కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడిన విషయాన్ని కెటిఆర్ వీడియోలు, అప్పటి మంత్రుల ప్రకనటలను సాక్షాలతో సహా మీడియా ముందుంచారు. అప్పటి సిఎల్‌పి నేత ఇప్పటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ..ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రజలు ఎవరు ప్రభుత్వానికి డబ్బులు కట్టవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి డబ్బులను దోచుకోవడానికే ఎల్‌ఆర్‌ఎస్ స్కీం అమలు చేస్తున్నారని కెటిఅర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు అధికారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారని, మరి ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా..? అని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులుదారులు ఎవరూ ఫీజు కట్టవద్దని, అధికారులు ఎవరైనా డబ్బులు కట్టమని అడిగితే గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియోలను చూపించి నిలదీయాలని ప్రజలకు సూచించారు. గతంలో భట్టి చెప్పిన మాటలు ఒట్టి మాటలు అని అర్థమైందని కెటిఆర్ ఎద్దేవా చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలి
ఎల్‌ఆర్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల పైన కనీసం లక్ష రూపాయల చొప్పున భారాన్ని మోపేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని కెటిఆర్ అన్నారు. మొత్తం రాష్ట్ర ప్రజల నుంచి ఈ ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా 20 వేల కోట్ల రూపాయలను దోచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. అధికారంలో లేనప్పుడు ఒక తీరుగా అధికారంలో ఉన్నప్పుడు మరొక తీరుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రుల వైఖరిపై కెటిఆర్ మండిపడ్డారు.
ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగేలా ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తమ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు అందరూ మద్దతు తెలపాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని కెటిఆర్ హెచ్చరించారు.
నో ఎల్‌ఆర్‌ఎస్.. నో బిఆర్‌ఎస్ అన్న ఉత్తమ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు…?
ఒక ఒకప్పుడు నో ఎల్‌ఆర్‌ఎస్ -..నో బిఆర్‌ఎస్ అన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని కెటిఆర్ నిలదీశారు. ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అప్పుడు ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఈరోజు ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో డబ్బులు లాక్కోవడం పైన స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే ఎల్‌ఆర్‌ఎస్ అంశం పైన మంత్రి సీతక్క మాట్లాడుతూ డబ్బులు దోచుకోవడానికే ఎఆర్‌ఎస్ పెట్టారని అన్నారని, మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో న్యాయస్థానంలో కేసు వేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవడం కోసం 420 హామీలు ఇచ్చిందని, అడ్డగోలుగా ఇచ్చిన హామీల అన్నింటిని తూ.చా తప్పకుండా అమలు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News