Saturday, December 28, 2024

భవిష్యత్తు యువతరానిదే

- Advertisement -
- Advertisement -
బీదవారని కోటీశ్వరులుగా చేయడమే టిటిడిపి లక్ష్యం
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ప్రజల ఆశీర్వాదాలు ఆదరణతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆదరణ లభిస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జహీరాబాద్ పార్లమెంట్, వరంగల్ తూర్పు, నిర్మల్ జిల్లాల నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బీదవాడిని కోటీశ్వరున్ని చేయాలన్న ఉద్దేశమే తెలంగాణ తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలకు నేడు తెలుగుదేశం పార్టీ ఎంతో అవసరం అని, తెలుగుదేశం జెండా కోసం ఎదురుచూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

తెలుగుదేశం పుట్టిన నాటి నుండి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం అని .. నాడు ఎన్టీఆర్ ఎన్నో సేవా కార్యక్రమాలు అమలు చేసి కోట్లాది మంది ప్రజల మన్నలను పొందారన్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజన్ 2020తో ఐటి హబ్‌లు ఏర్పాటు చేసి లక్షల మంది విద్యార్థులకు ఐటి రంగంలో ఉద్యోగాలు కల్పించారన్నారు. అదే మాదిరి విజన్ 2035 తో 15 సంవత్సరాలలో బీద వారిని కోటీశ్వరుల చేసే లక్ష్యంతో.. తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, నవతరానికి.. నేటి యువతరానికి బంగారు భవిష్యత్తుకు బరోసా ఇస్తుందన్నారు. నేటి యువతకు మద్యం కాదు మంచి భవష్యత్తు ఇచ్చే ప్రభుత్వాలు రావాలి అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. నేటి యువతరం నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం చేసిన ఘనత ఏంటో.. అభివృద్ధి గురించి తెలుసుకొని పసుపు జెండాకు పట్టం కట్టి పూర్వ వైభవం తేవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య, జహీరాబాద్ పార్లమెంట్, వరంగల్ తూర్పు, నిర్మల్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News