Monday, December 23, 2024

దివాలా కంపెనీపై అంబానీ కన్ను

- Advertisement -
- Advertisement -

Future meeting with shareholders on the 20th

ముకేశ్ అంబానీ మరో కంపెనీని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. దివాలా తీసిన సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అసెట్ కేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్-ఎసిఆర్‌ఇ) కన్సార్టియం చేజిక్కించుకోనున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం, సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్‌ఐఎల్ ఎసిఆర్‌ఇ కన్సార్టియం బిడ్‌కు రుణదాతల నుండి 90 శాతం మద్దతు లభించింది.

టెక్స్‌టైల్ కంపెనీకి సంబంధించిన బిడ్లపై ఓటింగ్ శనివారం సాయంత్రం ముగియగా, అర్థరాత్రి ఫలితాలు వెలువడ్డాయని సమాచారం. ఇంకా వెల్‌స్పన్ గ్రూప్ సంస్థలు ఈజీగో టెక్స్‌టైల్స్, జిహెచ్‌సిఎల్, హిమత్‌సింకా వెంచర్స్ కూడా ఈ సంస్థ బిడ్డింగ్‌లో ఉన్నాయి. ఆర్‌ఐఎల్ ఎసిఆర్‌ఇ అత్యధికంగా రూ.3,651 కోట్ల బిడ్ చేసింది. ఆర్‌ఐఎల్‌ఎసిఆర్‌ఇ ఆఫర్‌లో రుణదాతల కోసం 15 శాతం ఈక్విటీ కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News