Monday, December 23, 2024

ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: గాడ్ ఆఫ్ తెలంగాణ సిఎం కెసిఆర్ అయితే… ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మంత్రి కెటిఆర్ అని బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ తెలంగాణ చౌక్ లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బిఆర్‌ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.బిసి సంక్షేమం… పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై..భారీ కేకులు కట్ చేసి స్వీట్లు మొక్కలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ హైద రాబాద్ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఘనత మంత్రి కెటిఆర్ దనికొనియాడారు. కెటిఆర్ ఆలోచన విధానాలతోనే… తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు. కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందింటే అది కెటిఆర్ చలవేనన్నారు. ఐటి, మున్సిపల్ శాఖలో మంత్రి కేటీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

ప్రపంచంలోని ప్రముఖ కంపనీలు తెలంగాణ వైపు చూస్తు న్నాయంటే… అది కెటిఆర్ చొరవేనన్నారు. తెలంగాణ అభివృద్ది… ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో… కెటిఆర్ చేస్తున్న సేవలు వెలక ట్టలేనివన్నారు. కెసిఆర్ నాయకత్వంలో… కెటిఆర్ మార్గదర్శకంలో… బిఆర్‌ఎస్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకుంటుందన్నారు.

ప్రజాసేవలో నిండు నూరేళ్లు మంత్రి కేటీఆర్ వర్ధిల్లాలని… ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మంత్రి గంగుల ఆకాంక్షిం చారు.. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు. జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్ పలువురు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News