- Advertisement -
న్యూఢిల్లీ : బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌తో కిషోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ రిటైల్ కుదుర్చుకున్న రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని అత్యధికంగా రుణదాతలు తిరస్కరించారు. 75 శాతం వాటాదారులు డీల్‌ను అంగీకరించినప్పటికీ రుణదాతల నుంచి 75 శాతం అనుకూల ఓటింగ్ పొందలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ బుధవారం నాడు వాటాదారులతో సమావేశం నిర్వహించింది. ఎఫ్‌ఆర్‌ఎల్‌కు చెందిన శైలేష్ హరిభక్తి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించారు.
- Advertisement -