Monday, January 20, 2025

ఆ తీర్పు తప్పని నిర్థారించండి

- Advertisement -
- Advertisement -
Future Retail on Amazon in Delhi Court
ఢిల్లీ కోర్టులో అమెజాన్‌పై ఫ్యూచర్ రిటైల్

న్యూఢిల్లీ : సింగపూర్ కోర్టులో అమెజాన్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని నిర్ధారించాలని దేశీయ సంస్థ ఫ్యూచర్ రిటైల్ న్యూఢిల్లీ కోర్టును కోరింది. ఫ్యూచర్ గ్రూప్‌పై హక్కులను అమెజాన్ దుర్వినియోగం చేయడంతో 2019 నాటి ఒప్పందాన్ని సిసిఐ రద్దు చేసిందని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది. గత నెలలో దేశీయ యాంటిట్రస్ట్ బాడీ సిసిఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఫ్యూచర్ కూపన్స్‌తో 2019లో అమెజాన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. అంతేకాదు వాస్తవాలను దాచిందనందుకు గాను అమెరికా ఇకామర్స్ దిగ్గజం అమెజాన్‌పై రూ.200 కోట్ల జరిమానా కూడా విధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ఫ్యూచర్ గ్రూప్ కుదుర్చుకున్న 3.4 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని అమెజాన్ చాలా కాలంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఫ్యూచర్ కూపన్‌తో డీల్ నిబంధనల పేరుతో అమెజాన్ రిలయన్స్‌ఫ్యూచర్ డీల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే అమెజాన్ డీల్‌కు సంబంధించి వాస్తవ విషయాలను అణచివేసిందని, ఆమోదం కోరే సమయంలో తప్పుడు ప్రకటనలు చేసిందని సిసిఐ ఆర్డర్‌లో పేర్కొంది.

రూ.3500 కోట్ల బకాయిలు చెల్లించలేదు

కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ రుణాలు ఇచ్చిన బ్యాంకులకు రూ.3,494 కోట్ల బకాయిలను చెల్లించలేకపోయింది. 2021 డిసెంబర్ 31లోగా బ్యాంకులకు ఈ బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ పరిణామాలతో కేర్ రేటింగ్స్ ఈ కంపెనీకి రేటింగ్‌ను తగ్గించింది. అయితే అమెజాన్‌తో ఉన్న న్యాయపరమైన సమస్యల కారణంగా బకాయిలను చెల్లించలేకపోయినట్టు కంపెనీ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News