Tuesday, September 17, 2024

ఫ్యూచర్ తెలంగాణ నినాదానికి మంచి రెస్పాన్స్ వచ్చింది: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫ్యూచర్ తెలంగాణ నినాదానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌తో మంచి వాతావరణంలో చర్చలు ఫలప్రదంగా జరిగాయని కొనియాడారు. ఫారిన్ టూర్ నుంచి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. 11 రోజుల తరువాత సిఎం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో తెలంగాణకు మంచి ఎంకరేజ్ మెంట్ ఉందని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ఉన్నారని, కాగ్నిజెంట్‌తో పాటు చాలు కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. మూసీనది పునర్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. తాము ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా అభివృద్ధి కోసం పని చేస్తున్నామని, విదేశీ పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించేలా చర్చలు జరిపామని, రాజకీయాలకు అతీతంగా విదేశాల్లో అందరినీ కలిశామని బాబు స్పష్టం చేశారు. ఐటి, ఇండస్ట్రీస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News