ముంబయి: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభింస్తుంది. రాష్ట్రంలో ప్రతీరోజూ భారీగా కేసులు నమోద వుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తోలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే లాక్‌డౌన్ పై స్పందించారు. కరోనా కేసులు అధికమవుతుండడంతో మళ్లీ లాక్‌డౌన్ విధించడంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో హిందీ సినీ పరిశ్రమలో భయాందోళనలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధించవద్దని సిఎంకు వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్(ఎఫ్‌డబ్ల్యూవైసీఈ) సమాఖ్య లేఖ రాసింది. గత ఏడాది విధించిన లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, సినీ కార్మికులతోపాటు పరిశ్రమతో సంబంధం ఉన్న వారందరూ ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని.. ఇప్పడు మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోలేరని, సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడుతుందని లేఖలో ముఖ్యమంత్రిని అభ్యర్థించింది.
FWICE appeals to Maha CM not impose lockdown again