Thursday, November 14, 2024

జూన్ 15 నుంచి జీ -20 వ్యవసాయ రంగంపై సదస్సు: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూన్ 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జీ-20 వ్యవసాయం రంగంపై సదస్సు హైదరాబాద్‌లో నిర్వహిస్తు-న్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. జీ-20 దేశాలతో పాటుగా మరో 9 గెస్ట్ దేశాల వ్యవసాయశాఖ మంత్రులు సమావేశాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. భారత్ సహా ప్రపంచ దేశాలు ఈసమావేశాలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధన సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అగ్రికల్చర్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. జీ- 20 సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. కరోనా తరవాత తలెత్తిన సమస్యలపై చర్చించడానికి జీ-20 సమావేశాలు వేదికగా మారాయి. 46 రంగాలపై 250 సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 140 సమావేశాలు పూర్తయ్యాయి. రాజధాని కేంద్రంగా కీలకమైన రంగాలపై సమావేశాలు జరుగనున్నాయి. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లో స్టార్టప్ ను ప్రోత్సహించడానికి మీటింగ్స్ జరిగాయి. రెండో సమావేశం ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ అంశాలపై చర్చించారు. జూన్ 4,5,6 తేదీల్లో జీ-20 హెల్త్ వర్కింగ్ 5 మీటింగ్ జరిగింది. పర్యాటక రంగానికి సంబంధించి చివరి సమావేశాలు ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించనున్నరని తెలిపారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రగతి మైదాన్ వేదికగా ప్రధాని మోడీ అధ్యక్షతన తుది సమావేశాలు జరుగుతాయని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News