Monday, December 23, 2024

పర్యాటక అభివృద్దే లక్ష్యంగా జి -20 సమావేశాలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పర్యాటకం అభివృద్దే లక్ష్యంగా జి- 20 సమావేశాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ ఎక్కువైందని, గోవాలో నేటి నుంచి జి- 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు.. జూన్ 21, 22 తేదీల్లో జి- 20 టూరిజం మినిస్టర్స్ సమావేశం జరగనుందన్నారు. పర్యాటక రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారాలు అనే అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటివరకు జరిగిన జి- 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల ఫలితాలపై చర్చించి పరస్పర సహకారంపై వర్కింగ్ గ్రూప్ ఉమ్మడి అంశాలను ఆమోదించినున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News