Monday, December 23, 2024

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.నిర్మల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.నిర్మల,

రాష్ట్ర సెక్రటరీ జనరల్‌గా ఎఫ్‌ఏ యాకుబ్‌ పాషాల నియామకం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.నిర్మల, రాష్ట్ర సెక్రటరీ జనరల్‌గా ఎఫ్‌ఏ యాకుబ్‌ పాషా, కోశాధికారిగా జి. ఆనందం లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమపై ఉన్న నమ్మకంతో తమను ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులకు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని చిలకాని సంపత్ కుమార్ స్వామి అభినందించారు. నూతన కార్యవర్గం ఎల్లప్పుడూ ఉద్యోగులకు బాసటగా నిలవాలని సమన్వయంతో ఉద్యోగులను కలుపుకొని ఉద్యోగుల హక్కులకై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర కార్యవర్గ సమావేశం బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కొత్తగా అధ్యక్షురాలిగా ఎన్నికైన నిర్మల మాట్లాడుతూ తమ సంఘం పటిష్టతకు కృషి చేస్తానని, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.పురుషోత్తం, గడ్డం బాలస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.కనకరాజు,32 జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు.

Sampath

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News