హైదరాబాద్: కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు వినోద్ కుమార్, వివేక్‌లు రామాయణంలో లవకుశులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. డా. బిఆర్. అంబేడ్కర్ ఇనిస్టిట్యూట్‌లో గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నారు. ఈ వేడుకకు సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాలేజీలో కాకా విగ్రహాన్ని రేవంత్ ఆవిష్కరించిన అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సరోజా వివేక్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో దివంగత మాజీ కేంద్రం మంత్రి వెంకటస్వామి కుటుంబం ముందు వరసలో ఉందన్నారు. కాకా వర్ధంతి రోజున గ్రాడ్యయేషన్ నిర్వహించడం గొప్ప కార్యక్రమని ప్రశంసించారు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఆఫీస్ కాకా పేరు మీదనే ఉందని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యానని, ఎంతో మంది పోటీలో ఉన్నా కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేద విద్యార్థులకు విద్య అందిస్తున్నారని కొనియాడారు.