Wednesday, January 22, 2025

చైనా ప్రతినిధుల బ్యాగ్‌లపై అనుమానాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధులు 5 స్టార్ హోటల్ తాజ్‌లో బసచేయగా, వారి వద్దనున్న రెండు బ్యాగ్‌లు కలకలం సృష్టించాయి. ఆ రెండు బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు ఉన్నాయన్న అనుమానంతో హోటల్ సిబ్బంది ఒకరు సెక్యూరిటీ విభాగానికి ఫిర్యాదు చేయడంతో 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. ఆ రెండు బ్యాగ్‌లను స్కాన్ చేయాలని సెక్యూరిటీ సిబ్బంది కోరగా, దానికి ప్రతినిధులు అంగీకరించలేదు.

పోలీస్‌లు వచ్చి వాళ్లకు అర్ధమయ్యేలా నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దౌత్యపరమైన ప్రోటోకాల్ అంటూ చైనా అధికారులు ఆ బ్యాగ్‌లను చెకింగ్‌కు ఇవ్వలేదు.దీనిపై దాదాపు 12 గంటల పాటు వాగ్వాదం సాగింది. చైనా ప్రతినిధులకు , మన అధికారులకు మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగింది. చర్చల తరువాత ఆ బ్యాగ్‌లను చైనా ఎంబసీ కార్యాలయానికి పంపడానికి చైనా అధికారులు అంగీకరించారు. మొత్తానికి ఆ బ్యాగ్‌లు ఎంబసీకి వెళ్లిపోయాక భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News