Wednesday, January 22, 2025

నేడు జి20 సాంస్కృతిక మంత్రుల సమావేశం : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : వారణాసిలో ఎనిమిది ఆహ్వానిత దేశాల సాంస్కృతిక శాఖ మంత్రులు, 6 అంతర్జాతీయ సంస్థల సభ్యులతో జి20 సాంస్కృతిక శాఖ సమావేశాలు పూర్తికానున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వారణాసిలో శనివారం సాంస్కృతిక మంత్రుల సమావేశం జరగనున్నదని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంతోపాటు వివిధ అంశాలపై చర్చించేందుకు, ప్రపంచవ్యాప్తంగా సానుకూలమైన ప్రభావం తీసుకొచ్చేందుకు కావల్సిన పరిష్కారాలపై చర్చించేందుకు ఒక చక్కటి వేదికగా నిలవనుందన్నారు. ఫిబ్రవరిలో ఖజురహోలో, మే నెలలో భువనేశ్వర్‌లో, జూలైలో కర్ణాటకలోని హంపిలో జరిగిందన్నారు. చివరిగా వారణాసిలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జి 20 దేశాలతోపాటు వివిధ అంతర్జాతీయ సంస్థలు, భాగస్వామ్య పక్షాలనుంచి 159 మంది పాల్గొని.. వారణాసి నివేదికను వెల్లడిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారని వెల్లడించారు. ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో ఈ సమావేశం నిర్వహించడం శుభపరిణామం, గర్వకారణం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News