Wednesday, January 22, 2025

జి20 సక్సెస్ అయ్యింది.. ఢిల్లీ సదస్సుపై అమెరికా ప్రకటన

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఢిల్లీలో జరిగినజి20 దేశాల సదస్సు సక్సెస్ అయినట్లు అమెరికా తెలిపింది. ఆ సమావేశాలకు జో బైడెన్ కూడా హాజరైన విషయం తెలిసిందే. అయితే సోమవారం అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడుతూ.. జి20 సక్సెస్ అయినట్లు నమ్ముతున్నామని అన్నారు. జి20 ఓ పెద్ద సంస్థ అని, రష్యా, చైనా దేశాలు ఆ సంస్థలో సభ్యదేశాలని ఆయన అన్నారు.

మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జి20 సక్సెస్ అయినట్లు విశ్వసిస్తున్నామన్నారు.
ఢిల్లీ డిక్లరేషన్‌కు రష్యా గైర్‌హాజరు అయ్యిందన్న దానిపై ఆయన స్పందిస్తూ.. సభ్యదేశాల్లో భిన్న అభిప్రాయాలు ఉంటాయని, ప్రాంతీయ సమగ్రతను, సార్వభౌమతాన్ని గౌరవించాలన్న అంశాన్ని డిక్లరేషన్లో చేర్చామని, ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ చేపట్టిన నేపథ్యంలో ఆ డిక్లరేషన్ కీలకమైందని ఆయన తెలిపారు. అణు బెదిరింపులకు పాల్పడడం కానీ, అణ్వాయుధాలు వాడడం కానీ అమోదయోగ్యం కాదని డిక్లరేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.

ఢిల్లీ డిక్లరేషన్ పాజిటివ్ సంకేతాల్ని ఇచ్చింది: చైనా
మరో వైపు జి20 సమావేశాల నిర్వహణపై .. చైనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ డిక్లరేషన్ ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ సంకేతాన్ని పంపిందని డ్రాగన్ దేశం పేర్కొన్నది. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన జి20 సమావేశాలపై చైనా తన మౌనాన్ని వీడింది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ రికవరీ కోసం ఆ గ్రూపు చేస్తున్న పనుల్ని చైనా ప్రశంసించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై డిక్లరేషన్ కోసం భారత్ చేపట్టిన ప్రయత్నాల్ని చైనా మెచ్చుకున్నది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ఢిల్లీ డిక్లరేషన్ తయారీ ప్రక్రియలో చైనా కూడా సహకరించిందన్నారు. తమ దేశం నిర్మాణాత్మక పాత్రను పోషించిందన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళనల్ని పరిగణలోకి తీసుకున్నారని, సమగ్ర అభివృద్ధి కోసం ఏకగ్రీవంగా డిక్లరేషన్‌ను ఆమోదించినట్లు చైనా తెలిపింది. ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాలకు చైనా తరపున ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ హాజరయ్యారు. కాగా ఉక్రెయిన్ అంశంపై తమ అభిప్రాయంలో ఎటువంటి మార్పు ఉండదని చైనా తెలిపింది. చర్చలు, సంప్రదింపుల ద్వారానే ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభంపై శాంతి చర్చలకు తమ దేశం సహకరిస్తుందని ప్రతినిధి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News