Thursday, January 23, 2025

జి 20 సదస్సుకు పూర్తి హంగులతో వేదిక సిద్ధం…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్ వేదికగా గ్రూప్ ఆఫ్ 20 (జి 20) సమావేశాలు సెప్టెంబర్‌లో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని ఐటిపిఒ (ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్) కాంప్లెక్సును ప్రభుత్వ నిర్మాణ కంపెనీ (ఎన్‌బిసిసి) పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది. 2017 నుంచి ఈ పనులు జరుగుతున్నాయి. ఈ వేదిక ఈనెల 26న ప్రారంభం కానుంది. సుమారు 123 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంతో ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ భారత దేశపు అతిపెద్ద ఎంఐసిఇ ( మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు) గమ్యస్థానంగా నిలవనుంది. పునరాభివృద్ధి చేసిన ఈ ఆధునిక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఇసిసి) ప్రపంచం లోని టాప్ 10 ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కాంప్లెక్సుల్లో స్థానం సంపాదించింది.

జర్మనీ లోని హన్నోవర్ ఎగ్జిబిషన్ సెంటర్, షాంఘై లోని నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్, వంటి టాప్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్లకు దీటుగా న్యూఢిల్లీ లోని ఐఇసిసి కాంప్లెక్సును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ కాంప్లెక్సు స్థాయి, సామర్ధం, మౌలిక సదుపాయాలు, పరిమాణం ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ లెవెల్ 3 ఆస్ట్రేలియా లోని ఐకానిక్ సిడ్నీ ఒపెరా హౌజ్ కంటే ఎక్కువ మందికి సీటింగ్ కల్పిస్తుంది. సిడ్నీ ఒపెరా హౌజ్ సీటింగ్ సామర్ధం 5500 మంది కాగా, కన్వెన్షన్ సెంటర్లోని లెవెల్ 3 సీటింగ్ సామర్ధం 7000 మంది. ఈ ఐఇసిసి ని ప్రపంచస్థాయిలో మెగా కాన్ఫరెన్సులు, అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు, సాంస్కృతిక మహోత్సవాలను నిర్వహించడానికి తగిన వేదికగా గుర్తింపు తీసుకురానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News