Wednesday, January 22, 2025

మోడీ స్వాగతోపన్యాసంతో జి20 సదస్సు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతోపన్యాసంతో జి20 సదస్సు శనివారం ఇక్కడ ప్రారంభమైంది. దేశం పేరును భారత్‌గా పేర్కొంటూ ప్రధాని మోడీ జి20 సదస్సునుద్దేశించి ప్రసంగించారు.

ఆఫ్రికా దేశంలో సంభవించిన భూకంపాన్ని ప్రస్తావిస్తూ ఈ విషాద సమయంలో యావత్ ప్రపంచం మొరక్కోకు అండగా నిలబడి ఉందని, అవసరమైన సహాయాన్ని అందచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కొవిడ్ సంక్షోభ కాలం అనంతరం ప్రపంచం విశ్వాసరాహిత్యంతో సతమతమవుతోందని, యుద్ధంతో ఈ పరిస్థితి మరింత తీవ్రమైందని మోడీ తెలిపారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు సమాధానం కనుగొనాల్సిన సమయంలో జీవిస్తున్నామని, మానవతా వైఖరితో మన బాధ్యతలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News