రష్యాకు జి7 దేశాల హెచ్చరిక
లివర్‌పూల్: ఉక్రెయిన్‌ను ఆక్రమించేందుకు యత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జి7 దేశాలు రష్యాను హెచ్చరించాయి. కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని తెలిపాయి. జి7 విదేశాంగమంత్రులతో కలిసి ఇయు దేశాల విదేశీ వ్యవహారాల చీఫ్ ఓ సంయుక్త ప్రకటనను ఆదివారం విడుదల చేశారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైన్యం మోహరింపుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దుల్ని మార్చేందుకు బలప్రయోగం జరపడాన్ని అంతర్జాతీయ చట్టాలు అనుమతించవని గుర్తు చేశారు. ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించానని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తెలిపారు. అయితే, ఉక్రెయిన్ రక్షణకు పదాతిదళాలను పంపే యోచన ఏమీ లేదని ఆయన అన్నారు. గత వారం బైడెన్‌పుతిన్ మధ్య దాదాపు రెండుగంటలపాటు ఫోన్ సంభాషణ జరిగింది. అయితే, ఉక్రెయిన్ ఆక్రమణకు తామేమీ యత్నించడంలేదని రష్యా తెలిపింది. జి7 కూటమిలో యుకె, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఉన్నాయి.