Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌కు జి7 దేశాల భరోసా.. కొత్తగా సాయానికి సంసిద్ధత

- Advertisement -
- Advertisement -

G7 Leaders virtual meeting with Zelenskyy

ఉక్రెయిన్‌కు జి7 దేశాల భరోసా.. కొత్తగా సాయానికి సంసిద్ధత
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జి7 నేతల వీడియో సమావేశం

ఎల్మయు (జర్మనీ): ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండదండలు అందిస్తామని ఆర్థికంగా అభివృద్ధి చెందిన జి 7 సదస్సు సభ్య దేశాలు సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వీడియా ద్వారా మరోసారి తమ నిబద్ధతను స్పష్టం చేశాయి. రష్యా చమురు ధరలపై పరిమితి కొనసాగిస్తామని, రష్యా నుంచి దిగుమతులపై టారిఫ్‌ను పెంచుతామని, మరికొన్ని ఆంక్షలు విధిస్తామని తదితర సుదీర్ఘ ప్రణాళికలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకు దేశాల ప్రతినిధులు వివరించారు. రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు అత్యంత ఆధునిక ఉపరితల గగన క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కోసం కొనుగోలు చేసి కీవ్‌కు అందించడానికి అమెరికా సిద్ధమౌతోంది.

ఇంధన ధరలు, అత్యవసరాల ధరలు ప్రపంచంలో అత్యధికంగా పెరగడంతో పశ్చిమ దేశాలు యుద్ధంలో సహాయం చేయడానికి అలసి పోతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేయడంతో జి7 దేశాలు స్పందించి ఉక్రెయిన్‌కు కొత్తగా ఆర్థిక సాయంతోపాటు ఆయుధాలు, క్షిపణులు అందించడానికి సిద్దమవుతున్నాయి. వైట్ హౌస్ పరిసరాలతోపాటు రాజధాని వాషింగ్టన్ గగన తలాన్ని రక్షించడానికి ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం వినియోగిస్తున్న నార్వే తయారీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ క్షిపణులను ఉక్రెయిన్ రక్షణ కోసం కొనుగోలు చేయడానికి బైడెన్ సిద్ధమవుతున్నారు. ఇదే కాకుండా డొనబాస్‌లో రష్యా దురాక్రణకు అడ్డుకట్ట వేయడానికి ఉక్రెయిన్ సైన్యాలకు భారీగా మందుగుండు, రాడార్లు అందించడానికి అమెరికా సిద్ధమవుతోంది.

ఉక్రెయిన్ ప్రభుత్వం తన ఖర్చులను తట్టుకోడానికి 7.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని బైడెన్ ప్రకటించారు. అందులో భాగంగా మిలిటరీ, ఆర్థిక సాయానికి 40 బిలియన్ డాలర్ల ప్యాకేజీపై గత నెల సంతకం చేశారు. జి 7 దేశాల మూడు రోజుల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఉక్రెయిన్ పైనే ప్రధానంగా చర్చించారు. తరువాత భారత్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, సెనెగల్, అర్జెంటైనా దేశాలనేతలతో వాతావరణ మార్పులు, ఇంథనం, తదితర అంశాలపై చర్చిస్తారు. వీలైనంతవరకు ఉక్రెయిన్‌కు సహాయం అందించడానికి, రష్యాకు నాటోకు మధ్య సంఘర్షణను నివారించడానికి, కఠినమైన, జాగ్రత్తలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నామని జి7 దేశాల ముఖ్య ఆతిధ్య దేశ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్ సోమవారం ప్రకటించారు.

G7 Leaders virtual meeting with Zelenskyy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News