Sunday, December 22, 2024

వెరైటీ టైటిల్‌తో పలకరించబోతున్న నార్నే నితిన్

- Advertisement -
- Advertisement -

వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తోన్న నిర్మాణ సంస్థ GA-2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.9 చిత్రం ‘ఆయ్’. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్‌తో విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘ఆయ్’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. నిర్మాత బన్నీవాస్, హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక, డైరెక్టర్ అంజి కంచిపల్లి మధ్య జరిగే సరదా ఫోన్ సంభాషణతో టైటిల్‌ను వినూత్నంగా ప్రకటించటం విశేషం.

ప్రొడ్యూసర్స్ లో ఒకరైన బన్నీవాస్ దర్శకుడు అంజికి ఫోన్ చేస్తారు. టైటిల్ గురించి మాట్లాడే సందర్భంలో డైరెక్టర్ గోదావరి ప్రాంత ప్రజలు మాట్లాడే ‘ఆయ్’ పదంతో విసిగిపోతారు. అదే క్రమంలో హీరో, హీరోయిన్ లకు సైతం కాల్ కనెక్ట్ చేస్తారు. ఈ సందర్భంగా ‘ఆయ్’ని తప్పుగా టీమ్ అర్థం చేసుకోవటంతో వీడియో  చూస్తున్నవారికి నవ్వు తెప్పిస్తుంది.

నిర్మాత సరదా సంభాషణ, ఫన్నీ మీమ్స్ రెఫరెన్స్‌లతో టైటిల్ అనౌన్స్‌మెంట్స్ కాన్సెప్ట్ వీడియో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇదే క్రమంలో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ‘సమ్మర్‌లో కలుద్దాం’ అంటూ సినిమా సమ్మర్ లో విడుదలవుతుందని తెలియజేశారు. అలాగే సినిమా ఫస్ట్ లుక్ మార్చి 7న రిలీజ్ అవుతుందని వీడియో చివరలో రివీల్ చేశారు.

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం అత్యుత్తమమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేశారు. అలాగే సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. త్వరలోనే మరిన్ని ఎగ్జయిటింగ్ డీటెయిల్స్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News