Wednesday, January 22, 2025

‘గాలోడు’తో హిట్ కొడుతున్నాం

- Advertisement -
- Advertisement -

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న పక్కా మాస్‌అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాలోడు’. గెహ్నా సి ప్పి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తుండగా ప్రకృతి సమర్పణ లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా విడుదలైన ‘గాలోడు’ థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమై స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హీరో సుధీర్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. కొవిడ్ టైంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని సినిమా పూర్తి చేసి రిలీజ్ కి రెడీగా ఉన్నాం’ అని అన్నారు. దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల మాట్లాడుతూ.. ‘దర్శకుడిగా నా ఫస్ట్ సినిమా ‘సాఫ్ట్వేర్ సుధీర్’, ‘గాలోడు’ నా సెకండ్ మూవీ. మంచి కమర్షియల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడుతున్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ గెహ్నాసిప్పిలు తదితరులు పాల్గొన్నారు.

Gaalodu Movie Unit Press Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News