Thursday, January 23, 2025

‘మామా మశ్చీంద్ర’ ఫస్ట్ సింగిల్ గాలుల్లోన పాట విడుదల

- Advertisement -
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’ లో త్రిపాత్రాభినయం లో కనిపించనున్నారు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ మొదటి సింగిల్ గాలుల్లోన లిరికల్ వీడియో విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ ఈ పాటని మెస్మరైజ్ మెలోడిగా కంపోజ్ చేశారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. కపిల్ కపిలన్, నూతన మోహన్ అద్భుతంగా అలపించారు. ఈ పాటలో సుధీర్ బాబు దుర్గా, డిజే పాత్రలలో ఆకట్టుకున్నారు. మిర్నాలిని రవి, ఈషా రెబ్బా బ్యూటీఫుల్ గా కనిపించారు. పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News