- Advertisement -
శాంటియాగో: చిలీ తదుపరి అధ్యక్షుడిగా లెఫ్టిస్టు నాయకుడు గ్యాబ్రియల్ బోరిక్ ఎన్నికయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో వెలుగులోకి వచ్చిన బోరిక్ మొత్తం పోల్ అయిన 90 శాతానికి పైగా ఓట్లలో 56 శాతం రాగా ఆయన ప్రత్యర్థి జోశ్రీ ఆంటోనియో కాస్ట్‌కు 44 శాతం ఓట్లు లభించాయి. పదవి నుంచి వైదొలగనున్న ప్రస్తుత అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా అధ్యక్ష పదవికి ఎన్నికైన బోరిక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 35 సంవత్సరాల బోరిక్ మార్చిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. అత్యంత పిన్నవయస్కుడైన చిలీ అధ్యక్షునిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.
- Advertisement -