Saturday, April 5, 2025

బిఆర్ఎస్ ఐటి సెల్ పై కేసు నమోదు..

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఐటి సెల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచె భూముల వ్యవహారంలో నకిలీ ఫోటోలు వైరల్ చేశారన్న ఆరోపణలపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కంచె భూములను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జేసీబీలతో చెట్లు కొట్టివేస్తూ చదును చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

అయితే, అక్కడి పరిస్థితులను తప్పుదోవ పట్టించేలా కొన్ని ఫొటోలు, వీడియోలను బిఆర్ఎస్ం ఐటి సెల్.. ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈక్రమంలో బిఆర్ఎస్ ఐటి సెల్ ఇంచార్జ్‌లు క్రిశాంక్, కొణతం దిలీప్‌లపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News