Saturday, April 19, 2025

స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసుల నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఇన్‌స్టాగ్రాంలో కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన తప్పుడు వీడియోలు ట్యాగ్ చేశారని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు వీడియోలు ట్యాగ్ చేసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 179 కింద ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు గచ్చిబౌలి ఇన్స్‌స్పెక్టర్ మహ్మద్ హబీబుల్లా ఖాన్ తెలిపారు.

ఇప్పటికే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పోలీసులు పలువురికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన గిబ్లి తరహాలో ఉన్న ఇమేజ్‌ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ ఫొటో ఫేక్ ఇమేజ్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News