Thursday, December 19, 2024

కాంగ్రెస్‌లోకి గడల!

- Advertisement -
- Advertisement -

ఖమ్మం, సికింద్రాబాద్ నుంచి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు
గతంలో కొత్తగూడెం టికెట్ ఆశించిన మాజీ డీహెచ్
టికెట్ హామీ ఇచ్చి, చివరి నిమిషంలో వనమాకు ఇచ్చిన కేసీఆర్
మనస్తాపానికి గురయిన గడల
ప్రస్తుతం లాంగ్ లీవ్‌లో ఉన్న డాక్టర్

పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మాజీ డైరెక్టర్, డాక్టర్ గడల శ్రీనివాస రావు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఆయన సిద్ధమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలలో ఏదో ఒక టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారు. ఆయన తరఫున ఈ రెండు సీట్లకు శుక్రవారం గాంధీభవన్‌లో దరఖాస్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను కాంగ్రెస్ నిలబెట్టింది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న, ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న విద్యవంతులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సాహించింది. 52 మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజాసేవ, రాజకీయాలపై ఆసక్తి ఉన్న డాక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News