Monday, January 20, 2025

ఓటీటీలోకి గదర్ 2 తెలుగు వెర్షన్..

- Advertisement -
- Advertisement -

సన్నీ డియోల్, అమీషా పటేల్ నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గదర్ 2, థియేటర్లలో సంచలనం సృష్టించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ హిందీ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. గదర్ 2 తెలుగు వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లయితే, మీరు బుక్ మై షో స్ట్రీమ్‌లో రేపటి నుండి చూడోచ్చు. హిందీ తమిళం వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.

ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాధ్వా, గౌరవ్ చోప్రా, లవ్ సిన్హా ఈ బ్లాక్‌బస్టర్‌లో కీలక పాత్రలు పోషించారు. గదర్ 2 సినిమా 2023లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన గదర్ 2 దాదాపు 600 కోట్లు రాబట్టింది. అంతే కాకుండా ఈ మూవీ ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News