Saturday, November 2, 2024

దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పు: గాదరి కిశోర్

- Advertisement -
- Advertisement -

Gadari kishor praised Dalit bandhu

హైదరాబాద్: దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పు వస్తోందని ఎంఎల్‌ఎ గాదరి కిశోర్ తెలిపారు. శాసన సభలో దళితబంధుపై చర్చ సందర్భంగా తుంగతుర్తి ఎంఎల్‌ఎ గాదరి కిశోర్ మాట్లాడారు. తెలంగాణ సాధనలో భాగంగానే ఆనాడే దళితబంధుకు అంకురార్పణ జరిగిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అంబేద్కర్ ఆశయసాధనలో భాగంగానే గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి సిఎం కెసిఆర్ పాటుపడుతున్నారన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో పేదింటి ఆడబిడ్డలకు సర్కార్ అండగా నిలుస్తోందన్నారు. గత పాలకులు దళితులను ఓటు బ్యాంక్‌గానే చూశాయని మండిపడ్డారు. కెసిఆర్ ఆలోచనలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
దళితబంధు పథకం ద్వారా ప్రయోజనం పొందే లబ్దిదారులు ఎవరికి వారు ఉపాధి అవకాశం ఎంచుకునే వెసులుబాటు ఉందని, దళితుల కోసం ఇంతగా ఆరాటపడే వ్యక్తి ఎవరూ లేరని కిశోర్ ప్రశంసించారు. దళితబంధు పథకం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతకు నిదర్శనమన్నారు. హుజూరాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాల్లో దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నా విషయం తెలిసిందే. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News