Friday, November 22, 2024

రేవంత్ ఉంటే.. ఆ పార్టీ సర్వ నాశనం అవుతుంది: గాదరి కిషోర్

- Advertisement -
- Advertisement -

Gadari Kishore slams Revanth Reddy

హైదరాబాద్: డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని కెటిఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ.. ”తెలంగాణ కాంగ్రెస్ చీటర్ కమిటీ అధ్యక్షుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను టెస్టు చేయాలి. రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వ నాశనం అవుతుంది. నెక్ట్స్ కాంగ్రెస్ పరిస్థితి అంతే. టిపిసిసి మొత్తం డ్రగ్స్ టెస్టులకు సిద్ధమైతే టిఆర్ఎస్ మొత్తం సిద్ధం. గాడిదకు మూలాలు తెలుసు కాబట్టే గాడిదలాగా మాట్లాడుతున్నారని వాళ్ళ పార్టీ వాళ్లే అంటున్నారు. నువ్వు ఎంట్రుకతో సమానం అంటే మేము బొచ్చుతో సమానం అంటాం” అని రేవంత్ పై గాదరి కిషోర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Gadari Kishore slams Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News