- Advertisement -
నల్లగొండ: తుంగతుర్తి ఎంఎల్ఎ గాదరి కిషోర్ కుమార్ తండ్రి గాదరి మారయ్య కన్నుమూశారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో గుండెపోటు రావడంతో మారయ్య తుదిశ్వాస విడిచారని గాదరి కిషోర్ తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపారు. శనివారం 12 గంటల ప్రాంతంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎంఎల్ఎలు, ఎంపిలు, ప్రజాప్రతినిధులు మారయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు. నల్లగొండ మండలం నర్సింగ్భట్లకు చెందిన గాదరి మారయ్య పలు స్కూళ్లలో పిఇటిగా పని చేశారు.
- Advertisement -