బెంఘాజీ(లిబియా): వచ్చే నెలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు దివంగత నియంత మొహమ్మద్ గడాఫీ ఏకైక వారసుడు సీఫ్ అల్ ఇస్లామ్ గడాఫీని అనర్హునిగా లిబియా ఎన్నికల సంఘం ప్రకటించింది. అనేక నేరారోపణలలో దోషిగా తేలి శిక్షలు ఎదుర్కొంటున్న మాజీ నియంత కుమారుడు సీఫ్ అల్ ఇస్లామ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని, తమ నిర్ణయాన్ని ఆయన కోర్టులో సవాలు చేయవచ్చని లిబియా జాతీయ ఎన్నికల కమిటీ బుధవారం ప్రకటించింది. తన తండ్రి రాజీనామా కోరుతూ నిరసన చేపట్టిన ఆందోళనకారులపై హింసాకాండకు పాల్పడిన నేరానికి ట్రిపోలి కోర్టు 2015లో సీఫ్ అల్ ఇస్లామ్‌కు మరణశిక్ష విధించింది. కాగా..ప్రతిపక్షాల అభ్యంతరాల కారణంగా ఈ తీర్పు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. అదే విధంగా 2011లో తన తండ్రిపై తిరుగుబాటు జరగగా దానిని అణచివేయడానికి ఆయన హింసాకాండకు పాల్పడినట్లు కూడా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సీఫ్ అల్ ఇస్లామ్ నేరారోపణలు నమోదయ్యాయి. ఐక్యరాజ్యసమితితో చొరవతో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు కోసం డిసెంబర్ 24న లిబియాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
అధ్యక్ష ఎన్నిక పోటీకి గడాఫీ కుమారుడు అనర్హుడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -