Wednesday, January 22, 2025

డబ్బు కట్టలతో దొరికిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ కంపెనీ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం ఊపందుకుంది. పార్టీలన్నీ తమ తమ ప్రచారంలో శరవేగంగా దూసుకు పోతున్నాయి. దీనికి తోడు ప్రలోభాలకు సైతం తెరలేపాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు డబ్బులతో వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఇండస్ట్రీస్, ఓ వార్తాపత్రిక యజమాని అయిన గడ్డం వివేక్ చెన్నూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. అయితే చెన్నూరు నియోజకవర్గానికి ఆయన కంపెనీలలో పనిచేస్తున్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవి కిషోర్, అదే విధంగా ఆయనకు సంబంధించిన పత్రికలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ముదిగంటి ప్రేమ్ కుమార్‌లు రూ. 50 లక్షలతో చెన్నూరుకు బయల్దేరారు. కాగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు వీరు ప్రయాణిస్తున్న బైక్ (టిఎస్07జెబి 8681)ను ఆపారు. వారి బ్యాగులో చూడగా.. డబ్బు కట్టలు బయటపడ్డాయి.

తమ ఓనర్ వివేక్ ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలోని లీడర్లను కొనుగోలు చేయడానికి 50 లక్షలు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు వారిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పట్టుబడిన వారి నుండి 50 లక్షల రూపాయల నగదు, రెండు మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News