Sunday, December 22, 2024

నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సినీ కళాకారులకు ఇచ్చే నంది అవార్డులను ఇక నుంచి గద్దర్ అవార్డులుగా ప్రదానం చేయనున్నట్లు ప్రకటించనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ అవార్డులను అర్హులైన కళాకారులకు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గద్దర్ జయంతి సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో గద్దర్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై గద్దరన్న పేరిట అవార్డులు ఇస్తామని అన్నారు. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఈ అవార్డులు ప్రధానం చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది గద్దరన్న జయంతి నుంచి ఈ అవార్డుల ప్రదానం ఉంటుందని సీఎం ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News