Monday, November 18, 2024

గద్దర్ నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గద్దర్ ప్రజా పార్టీ పేరుతో బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే నెలరోజుల్లో పూర్తికానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన విలేకరులకు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద పోటీ చేస్తానని ప్రకటించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఓట్ల యుద్దానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఓటును బ్లాక్ మనీ నుంచి బయటకు తేవాలన్నారు. ఇప్పటి వరకు అజ్ఞాత వాసం నుంచి ప్రజలను చైతన్యం చేశానని ,ఇక నుంచి పార్లమెంటరీ పంథా ను నమ్ముకుని బయలుదేరుతానని చెప్పారు.

ఇక నుంచి జరిగేది శాంతి యుద్ధం..ఓట్ల యుద్ధమని పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం కోసం గ్రామ గ్రామానికి వెళ్తానని, సచ్చే ముందు సత్యమే చెపుతున్నా అని, నేనే భావ విప్లవకారుడిని, అయిదేళ్ళ అడవిలో ఉన్నానన్నారు. గద్దర్ తో పాటు మీడియా సమావేశంలో గద్దర్ ప్రజా పార్టీ జనరల్ సెక్రటరీ నగేష్, నేషనల్ మీడియా కో ఆర్డినేటర్ ఎ. రాజేష్, అడ్వకేట్ విజయ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News